సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా వ్యాప్తంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆయా ఆలయాలలో అమ్మవారికి అవతరాలు చేశారు. పదవ శక్తిపీఠం, శివుడు కోడి రూపంలో వెలిసిన పాదగయ క్షేత్రం పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా కనిపించారు .కాకినాడ దేవాలయం వీధి శివాలయంలో అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. శ్రీపీఠంలో పరిపూర్ణానంద సరస్వతి మహా శక్తి యాగాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాకు ఆధ్యాత్మిక శోభ వచ్చింది. భక్తులు భారీగా తరలివస్తున్నారు.ఆలయాలు కిటకిటలాడుతున్నాయి భవాని మాలలు ధరించిన భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు