సిరా న్యూస్,అన్నమయ్య;
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల వద్ద క్షుద్ర పూజలు చేశారని కలకలం రేగింది. సదరు క్షుద్ర పూజల అనుమానంపై విద్యార్థులు ఉపాధ్యాయుల్లో భయం అలుముకుంది. అసలు కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద ప్రధాన రహదారిపై పూజలు చేయవలసిన అవసరం ఏముంది అన్న అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు. చేసిన వ్యక్తి ఎవరు దేనికోసం చేశారు, ఏదైనా దురుద్దేశంతో సదరు పూజలు చేశారా అని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది క్షుద్ర పూజలేనా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సదరు విషయంపై విద్యాశాఖ అధికారులు,పోలీసులు దృష్టిని కేంద్రీకరించి ఈ విధంగా భయాన్ని కలిగించే పూజలు చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని, విద్యార్థుల్లో,ఉపాధ్యాయుల్లో భయాన్ని పోగొట్టాలని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.