సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో సినిమా షూటింగ్ ప్రారంభం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ” ఓదెల టు. ” సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు . యంగ్ డైనమిక్ డైరెక్టర్ ఆయుధం సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమై ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శత్వం వహించిన సంపద్ నంది. సోమవారం శ్రీ మల్లికార్జున స్వామి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “ఓదెల టు” చిత్రానికి హీరోయినీ గా మిల్కీ బ్యూటీ తమన్న నటిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం ఓదెల హై స్కూల్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో మర్రి చెట్టు కింద ధ్యానం చేస్తున్న సీన్ చిత్రకరించారు. మిల్కీ బ్యూటీ తమన్నను చూడ్డానికి వచ్చిన అభిమానులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు షూటింగ్ ను తిలకించారు. మంగళవారం సాయంత్రం వరకు షూటింగ్ నిర్వహిస్తున్నారు . ఎలాంటి ఘర్షణలు జరగకుండా పొత్కపల్లి సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ పాల్గొన్నారు.