సిరా న్యూస్, ఓదెల
ఓదెలలో కుంకుమ పూజ కార్యక్రమం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మండల ఆఫీస్ దగ్గరలో ఉన్న దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం మండపం వద్ద 60 మంది మహిళలు కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమం దాదాపు గంటకు పైగా సమయం తీసుకున్న అందరూ ఉపవాస దీక్ష ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం అన్న ప్రసాదం చేపట్టారు. అలాగే రామాలయంలో 10116 నోట్లతో దుర్గామాతకు దండ గా అలంకరించారు.కార్యక్రమంలో దుర్గ మాత నవరాత్రి ఉత్సవాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.