సిరా న్యూస్, ఓదెల
ఓదెలలో బస్ షెల్టర్ లేక విద్యార్థులు ఇక్కట్లు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బస్‌షెల్టర్ లేక విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మోడల్ స్కూల్ లో చదువుకునే విద్యార్థులు వివిధ గ్రామాల నుండి బస్సు సౌకర్యం ద్వారా స్కూల్ కు వచ్చి వెళ్తుంటారు. కానీ బస్సు ఆగు స్థలంలో బస్ షెల్టర్ లేక విద్యార్థులు, ప్రయాణికులు కెనాల్ బ్రిడ్జిపై కూర్చుంటున్నారు. ఇక వర్షం వస్తే పరిస్థితి చెప్పలేనిది. ఈబస్టాప్ వద్ద ఎప్పుడు చూసినా ప్రయాణికులు, విద్యార్థులు బస్సులకోసం, ఆటోల కోసం రోడ్డుపక్కన వేచి ఉండాల్సిన దుస్థితి. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థ ద్వారా అయినా పిల్లల సౌకర్యార్థం బస్ షెల్టర్ నిర్మించాలని ప్రయాణికులు, విద్యార్థులు కోరుతున్నారు.