సిరాన్యూస్, ఓదెల
ఓదెల జిల్లా పరిషత్ హై స్కూల్ లో 100శాతం ఉత్తీర్ణత
ఓదెల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదవ తరగతి 100శాతం ఉత్తీర్ణత సాధించింది. మంగళవారం వెలువడిన పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఓదెల విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎం. సాహితి 8.8, ఈ వైష్ణవి, ఆర్. సాయి కృష్ణ, ఎం. అక్షయ 8.3 జి పి ఏ సాధించారు. ప్రధానోపాధ్యాయులు వి పద్మ, డాక్టర్ ఇప్పనపళ్లి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు , ఓంకార్ సి ఆర్ పి విద్యార్థిని విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు.