సిరా న్యూస్,నాగర్ కర్నూలు;
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నె వారిపల్లి లో గత నాలుగు రోజులుగా నల్లమల లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉదృ తంగా ప్రవహిస్తున్న డిండి వాగులో చిక్కుకున్న 11 మంది చెంచుల ను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మంగళవార ఉదయం బోటు సాయంతో సురక్షితంగా బయటకు తరలించారు. బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సోమవారం సాయంత్రం నుంచి అచ్చంపేట డిఎస్పి శ్రీనివాస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ వాగు వద్దనే ఉన్నారు