సిరా న్యూస్,పెద్దపల్లి;
ఈనెల 29న ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్ లో మాల కుల బంధువులు, ఉద్యోగుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుద్దం డానియల్, ప్రధాన కార్యదర్శి దాసరి రాజు తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాల కుల బంధువులు, ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సదస్సుల్లో వివిధ డిమాండ్లపై చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. సదస్సుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, కె ఆర్ నాగరాజు, మేడిపల్లి సత్యం, మాల వర్గానికి చెందిన ప్రముఖులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల వెంకటస్వామి, కూడె అంజయ్య, సంయుక్త కార్యదర్శి ముడుసు లక్ష్మన్, కోశాధికారి కోడి సంజీవ్ రావు, కనుమల్ల కొమురయ్య, దుస్స అశోక్ కుమార్, పండుగ భాను తేజ, గుడిసెల భీంసేన్, తదితరులు పాల్గొన్నారు.