సిరాన్యూస్, ఓదెల
రాష్ట్ర సాధన పోరులో కొండాది కీలకపాత్ర : పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షులు డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీది కీలకపాత్ర అని పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షులు డాక్టర్ ఇప్పనపల్లి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల రంగుల దుకాణం సెంటర్ దగ్గర ఓదెల పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షులు డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్బంగా గ్రామ అధ్యక్షులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్రం కోసం పదవి నీ సైతం వదులుకొని తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో ఓదెల పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మెరుగు సారంగం నేత, మెరుగు భీష్మాచారి నేత, క్యాతం వెంకటేశ్వర్లు నేత, క్యాతం రాజేంద్రప్రసాద్ నేత, క్యాతం టైలర్ శ్రీనివాస్ నేత, క్యాతం మల్లేశం నేత, అరుకాల తిరుపతి, తాటికొండ సత్యం నేత, సింగని రాజేందర్ నేత .క్యాతం జగదీశ్వర్ నేత , పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.