సిరా న్యూస్,నల్లగొండ;
అధికార పార్టీ ఎమ్మెల్యే లపై సొంత కేడర్ రివర్స్ ఎటాక్ ఇవ్వడం కలకలం రేపింది. ఆరు గ్యారెంటీలు,రైతుల ఇబ్బందులపై కార్యకర్తలు గళం విప్పారు. ఎమ్మెల్యేల సాక్షిగా ప్రభుత్వ వైఖరిపై పార్టీ శ్రేణులు అసంతృప్తి వెళ్లగక్కారు. నల్లగొండ లోని ఓ సమావేశంలో ఎమ్మెల్యేలకు కార్యకర్తలు సూటి ప్రశ్న వేసారు. మరోవైపు, కాంగ్రెస్ కార్యకర్తల ఆక్రోశాన్ని క్యాష్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ వుంది. “కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై సొంత పార్టీ నేతల అసంతృప్తి” అంటూ గులాబి దళం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది. ఎమ్మెల్యేలు ఉన్న వేదికపై కార్యకర్తల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆరు గ్యారెంటీలు అన్ని చోట్లా అమలు కావడం లేదు. గ్రామాల్లో ఆరు గ్యారెంటీలపై ఒక్కొక్కరు నిలదీస్తుంటే.. మాకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు. వేల పెన్షన్ ఏమైంది అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతుల ధాన్యం వారం రోజుల్లో కొనేవారు. పది రోజుల్లో డబ్బులు అకౌంట్ లో పడేవి. రైతులు ఐకెపి సెంటర్లకు ధాన్యం తెచ్చి నెల దాటినా పట్టించుకునే నాదుడు లేడు. రైతుల దుస్థితి చూస్తుంటే మాకు గుండె తరుక్కుపోతుందని కాంగ్రెస్ కేడర్ వాపోతుంది..