సిరా న్యూస్,పెద్దపల్లి;
మండలంలోని రాగినేడు గ్రామానికి చెందిన కార్మిక నాయకుడు పెర్క రాజమల్లు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి బొంకూరి సురేందర్ ఆద్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి రాజమల్లుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సురేందర్ రెడ్డిని, సురేందర్ సన్నీ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఏఐఎఫ్ బీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పోటీ పడి విజయం సాధించేలా పని చేయాలని నాయకులకు సురేందర్ రెడ్డి సూచించారు.