సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట జిల్లా పోలీస్ సిబ్బందికి పరీక్షల కార్యక్రమాన్ని రాజగోపాలపేట పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పోలీస్ అధికారులు సిబ్బంది ప్రైమర్ హెల్త్ సెంటర్లో బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. పోలీసులకు విధినిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి. స్వాత్విక ఆహారం భుజించడం ఉత్తమం. మనం తీసుకునే ఆహారంలో పాలు పండ్లు తప్పకుండా ఉండాలని అన్నారు.