వెంటిలేటర్ పనిచేయక రోగి మృతి
సిరా న్యూస్,వరంగల్;
జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ఎంజీఎం లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఒక రోగి మృతి చెందాడు. తుడు నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి (45). ఆర్ఐసిలో చికిత్స పొందుతున్నాడు. శ్వాస సంబంధిత వ్యాధితో ఎంజీఎం లో చేరాడు. విద్యుత్ అంతరాయంతో కాసేపు వరకు పనిచేసిన వెంటిలేటర్ తరువాత నిలిచిపోయింది. జనరేటర్ కుడా పనిచేయలేదు. ఒక్కసారి వెంటిలేటర్ ఆఫ్ అవ్వడంతో బిక్షపతి మృతి చెందాడు