సిరా న్యూస్, నిర్మల్:
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు…
+ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
+ కుటుంబానికి 1.5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రానికి చెందిన పెద్ద భీమయ్య కుటుంబ సభ్యులకు రూ.1.5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అందించారు. గత కొంతకాలంగా భీమయ్య బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆయనకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తమ ఆర్థిక ఇబ్బందుల గురించి ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. దీంతో చలించిపోయిన పోయిన ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు మంజూరు కావడంతో బాధిత కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిరుపేదలను ఆదుకునేందుకే తమ ప్రభుత్వం ఉందని అన్నారు. అందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలని ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుండి 10 లక్షల పెంచినట్లు తెలిపారు.