సిరా న్యూస్, ఖానాపూర్:
ఖానాపూర్‌లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 6వ వార్డులో శనివారం ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన ఫారాలను అందుబాటులో ఉంచిన అధికారులు, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ ఆఫ్రీన్ బేగం మాట్లాడుతూ.. ప్రజలంత ప్రజాపాలన దరఖాస్తులను తప్పక సమర్పించాలని అన్నారు. రేషన్ కార్డ్ లేని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.