సిరాన్యూస్, బేల
విద్యార్థులు పరీక్షలకు సిద్ధంకండి : కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు
కాకతీయ యూనివర్సిటీ పరిధి లో డిగ్రీ మొదటి మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్ష లు ఈ నెల చివరి వారం లేదా డిసెంబరు మొదటి వారం లో ఉండే అవకాశం ఉందని, ఇప్పటి నుండి పరీక్ష లకు సిద్దం కావాలని కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు అన్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ద గా పరీక్ష లు కి ప్రిపేర్ కావాలన్నారు. ఎప్పటి సెమిస్టర్ పరీక్షలు అప్పుడే పాస్ కావాలని ,అధిక సబ్జెక్టు ల లో ఫెయిల్ అయితే డిటైన్ అవడం వలన విద్యా సంవత్సరం కోల్పోవడంతో పాటు యూనివర్సిటీ వెళ్లి రీ అడ్మిషన్ తీసుకోవాలని తెలిపారు. అలాగే 4 సంవత్సరం ల పాటు ఫెయిల్ అయితే టైం ఫ్రేమ్ కిందకు రావడం వలన వేలాది రూపాయలు యూనివర్సిటీ కి ఫీ చెల్లింపు చేయాలని పేర్కొన్నారు. ఇవి అన్ని కాకుండా ఇప్పటి నుండి పరీక్ష లకు సిద్దం కావాలని పరీక్ష వింగ్ ఇంచార్జి సాగర్ కోరారు.