సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా శాసన మండలి లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం , జాతీయ గీతాన్ని అలపించి , జాతీయ జెండాను ఎగురవేసారు.అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ , మహాత్మా గాంధీ విగ్రహాలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పులా మాల వేసి నివాళ్ళు అర్పించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని , జాతీయ జెండాను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎగురవేసారు.