సిరా న్యూస్, లోకేశ్వరం
పుస్పూర్‌కు చేరిన అయోధ్య అక్షింతలు…
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ గ్రామంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. మంగళవారం అయోధ్య రామ మందిరం అక్షంతలు గ్రామానికి చేరుకోవడంతో, ప్రజలంత ఈ వేడుకను పండగలా జరుపుకున్నారు. అక్షంతలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మేళతాలలతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. రామ జన్మ భూమి అక్షంతలు గ్రామానికి చేరుకోవడం అదృష్టమని అన్నారు. గ్రామస్తులంత పెద్ద ఎత్తున శోభాయాత్రలో పాల్గొనడంతో, యావత్ గ్రామం రామ నామ స్మరణతో మార్మోగింది.