సిరా న్యూస్, గుడిహత్నూర్:
మానవత్వం చాటిన సర్పంచ్ గిత్తే కల్పనా గజానంద్…
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారీ గ్రామ సర్పంచ్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవలే అగ్నిప్రమాదం కారణంగా ఇల్లు కాలిపోయి సర్వసం కోల్పోయిన దోమకొండ సుధాకర్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్, అధైర్యపడవద్దని తామంత అండగా ఉంటామని భరోసా కల్పించారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు, వంట సరుకులు, వంట పాత్రలు అందించి తన ఉదారత చాటుకున్నారు. కాగా సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభిమానులు, ఇతర దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు.