సిరా న్యూస్, పెంబి:
ఆరు గ్యారెంటీల కోసం ఇంటింట సర్వే…
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల కోసం ఇంటింట సర్వే నిర్వహించాలని నిర్మల్ జిల్లా పెంబి మండల ఎంపిడీవో సుధాకర్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో వివిద శాఖల అధికారులతో కలిసి ఆరు గ్యారెంటీలపై అవగాహణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 27 నుంచి గ్రామ స్థాయి అధికారులు ఇంటింట తిరుగుతూ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. రేషన్ కార్డ్ కలిగి ఉండి ఆరు గ్యారెంటీల కోసం అర్హత ఉన్న వారి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు అశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను సంబందిత రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పది రోజుల పాటు దీని కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆయన ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, పకడ్బందీగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహాసీల్దార్ లక్ష్మణ్, ఎస్సై రజనీకాంత్, ఎంపీవో రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.