లగేజ్ కమ్ గ్వార్ వ్యాన్ కోచ్‌లో లగేజ్, ఫర్నీచర్ పూర్తిగా దగ్దం
సిరా న్యూస్,నాందేడ్;
ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. లగేజ్ కమ్ గ్వార్ వ్యాన్ కోచ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే లోపే బోగీలోని లగేజ్, ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయాయి. అనంతరం దాదాపు అరగంటపాటు శ్రమించి ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వే స్టేషన్‌లో పూర్ణ-పర్లి ప్యాసింజర్ రైలులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.స్టేషన్ సిబ్బంది ద్వారా సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు.