సిరా న్యూస్,కమాన్ పూర్
రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని వకీల్ పల్లె ప్లాట్ లలో అంగన్వాడి కేంద్రానికి నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
రామగిరి మండలం సెంట్రనేరి కాలనీ వకీల్ పల్లె ప్లాట్స్ నూతన ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇప్పటివరకు అంగన్వాడి అదే భవనం లో పాఠశాల నిర్వహణ చేస్తున్నారని గ్రామము సింగరేణి ప్రభావిత ప్రాంతమని గతంలో వీరికి అంగన్వాడి కేంద్రం నిర్మాణం కొరకు ఆర్ అండ్ ఆర్ నిధులు మంజూరు అయినప్పటికీ భవన నిర్మాణం చెయ్యలేదు. కనీసం భూమి పూజ కూడా నోచుకోని ఆర్ అండ్ ఆర్ గ్రామ ప్రజలు అద్దె భవనంలో పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఐటి మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు కి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రజలు స్కూల్ భవనం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీరికి సొంత అంగన్ బడి నిర్మాణ కేంద్రం కావాల్సిన నిధులు ఇప్పించగలరని పెద్దపల్లి కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ జల్లారం మాజీ ఎంపిటిసి బానోత్ చందు తదితరులు పాల్గొన్నారు.