సిరా న్యూస్,కమాన్ పూర్;
ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏ స్థాయిలో ఉన్నా మాతృభూమిని, చిన్ననాటి స్నేహితులను మరువకూడదని వందన హైస్కూల్ కరస్పాండెంట్ ముడుసు లక్ష్మణ్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలోని వందన హైస్కూల్ 2007-08 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెంటినరికాలనీలోని సింగరేణి ఫంక్షన్‌హాల్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రామంలో ఆయన మాట్లాడుతూ.. సుమారు16 సంవత్సరాల తర్వాత విద్యార్థులందరినీ ఓ చోట చూడడం సంతోషంగా ఉందన్నారు. తన వద్ద చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండడం గర్వంగా ఉందన్నారు. ఏ హోదాలో ఉన్నా ఒకరికొకరు అండగా ఉండాలని సూచించారు. సుమారు 50 మంది పూర్వ విద్యార్థులు, నాటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్ డేస్ మెమరీస్‌ను నెమరు వేసుకున్నారు. ప్రస్తుతం వారి వృత్తి, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. గురువులను సన్మానించి, వారి ఆశిర్వాదం తీసుకున్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ వివిధ హోదాల్లో స్థిరపడిన వారంతా ఆనందంగా గడిపారు.