సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీబాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగు తున్న శరన్నవరాత్రి ఏర్పాట్లును దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.సుబ్బారావు పరిశీలించారు. దేవస్థానానికి వేచ్చేసిన దేవాదాయ శాఖ ఆర్.జె.డి. కె. సుబ్బారావు దంపతుల ను ఆలయ ఈ.వో. ఉండవల్లి వీర్రాజు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని ఆర్.జె.డి కె. సుబ్బారావు దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. ఆలయ అర్చకులు ఆర్.జె.డి దంపతులకు వేదాశీర్వచ నాలను అందజేసారు. ఈ సందర్భంగా ఆర్.జె.డి సుబ్బారావు మాట్లాడుతూ అక్టోబర్ 3 నుండి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లును పరిశీలించడం జరిగిందని, ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు.