అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సిరా న్యూస్;
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును రామాపురం మండలం మేదరపల్లి చెక్ పోస్టు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. జేసీబీ సాయంతో బస్సును, లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *