సిరా న్యూస్,నల్గోండ;
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు వరద ఉధృతి తగ్గడంతో.. డ్యామ్ లోని మొత్తం క్రస్ట్ గేట్లను మూసేశారు. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 44 వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో రూపంలో వస్తుండగా.. అంతే మొత్తంలో పవర్ హౌస్.., కుడి, ఎడమ కాలువలుచ ఏఎంఆర్పీ వరద కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది. అలాగే డ్యాం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను.. 309.0570 టీఎంసీలకు చేరింది.