సిరా న్యూస్,యాదాద్రి;
శనివరా ంనాడు నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు….స్వాతి నక్షత్రం సందర్బంగా భక్తులు,స్థానికులు అధిక సంఖ్యలో ఆలయ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణచేశారు….నారసింహుని జన్మనక్షత్రం సందర్బంగా శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శత కలశాల లోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు,పెరుగు తో వేదమంత్రలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు…స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో ఆలయ ఈఓ, స్థానికులు,భక్తులు పాల్గొన్నారు…యాదగిరిగుట్ట ఆలయంతో పాటు
అనుబంధ ఆలయంలో కూడా యధావిధిగా ఉత్సవాలు నిర్వహణ చేపట్టారు……