నా భర్తను కాపాడండి – ఒక మహిళ అక్రోదన

సిరా న్యూస్,అన్నమయ్య;
కలకడ మండలం, గుడిబండ, తెట్టు గ్రామానికి చెందిన కిల్లా రెడ్డిశేఖర్ భార్య అయిన కిల్లా అశ్విని అను నేను తెలియజేయడం ఏమనగా నా భర్త కిల్లా రెడ్డిశేఖర్ (33) మంచి విద్యావేత్త, సామాజిక కార్యకర్త,ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజలకోసం పోరాడిన వ్యక్తి విధి వైపరీత్యాల వల్ల కాలేయ వ్యాధి భారినపడి తీవ్ర అనారోగ్యానికి గురై ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చెన్నై లాంటి మహానగరాలలో లక్షలాది రూపాయలు వెచ్చించినప్పటికీ, కాలేయం మార్పిడి జరిగితే కాని బ్రతకడని వైద్యలు నిర్ధారించారు. నిరుపేద గిరిజనులమైన మాకు అంత స్థోమత లేనందున కాలేయం మార్పిడికి సుమారు 50 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. నా భర్త నా కుటుంబానికి ఆచారం. ఆయనపై ఆధారపడి బ్రతుకున్నాము. మాకు 3, 6 సం॥ల చిన్న పిల్లలు వున్నారు. వృద్ధ తల్లిదండ్రులు వున్నారు.కావున దాతలు దయయుంచి నా భర్తను బ్రతికించుకోవడానికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాలని రెండు చేతులు జోడించి పత్రికాముఖంగా వేడుకుంటున్నాను.

సహాయం చేయదలచిన దాతలు కిల్లా రెడ్డిశేఖర్

గూగుల్ పే & పోన్- పే: 9553173351

UPI killa sekhar@ibl

A/c No 36922652056

IFSC Code: SBIN0012727

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *