అక్బర్ సేవలు రాష్ట్రానికే ఆదర్శం
అభినందనలతో “ప్రశంసా పత్రం” అందజేసిన విడిసి
సిరా న్యూస్,జగిత్యాల;
జిల్లా లోని బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్బర్ ను “శభాష్ అక్బర్ సాబ్” అంటూ గ్రామ ప్రజలు, గ్రామ అభివృద్ది కమిటి కొనియాడారు. గ్రామ అభివృద్ది కమిటి ఆధ్వర్యంలో ఆయనకు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం అభినందనలతో కూడిన”ప్రశంసా పత్రం” అందజేశారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విడిసి కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ గత కొంత కాలంగా పంచాయతీ కార్యదర్శి అక్బర్ గ్రామానికి, ప్రజలకు అందజేస్తున్న సేవలను కొనియాడారు. గ్రామ పంచాయతీలో తగిన బడ్జెట్ లేకున్నా – ప్రజల సహకారంతో “బతుకమ్మ – దసరా” పండుగల ఉత్సవాలకు ఆయన చేసిన గొప్ప ఏర్పాట్లను, సౌకర్యాలను, ఆయన అందించిన సేవలను, స్వయంగా అక్బర్ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజల్లో, ఉత్సవాలలో కూడా పాల్గొన్న విధానాన్ని, సమయ స్ఫూర్తితో వ్యవహరించిన తీరును వివరించారు.
కుల – మతాలకతీతంగా పంచాయతీ కార్యదర్శి అక్బర్ చేసిన సేవలను గ్రామ ప్రజలంతా గుర్తించి ముక్త కంఠంతో కొనియాడుతున్నారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి “అక్బర్ సేవలు” రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని, ప్రపంచ ఖ్యాతి పొందాలని వారంతా ఆశించారు. ఇలాంటి ప్రజా సేవకులు ఉంటే గ్రామాలు అత్యున్నత స్థాయిలో అభివృద్ధిని సాధిస్తాయని అన్నారు. ఇలాంటి ప్రశంసలు, పురస్కారాలు, అవార్డులు, రివార్డులు, పదోన్నతులు ఇంకా ఎన్నెన్నో అక్బర్ సాబ్ పొందాలని వారంతా మనసారా కోరుకుంటున్నామని తెలిపారు.
గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి, వైస్ చైర్మన్ పెద్దనవేని రాగన్న, విడిసి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి పెద్దనవేని రాజేందర్, సాంస్కృతిక కార్యదర్శి డా: నక్క రాజు, సహాయ కార్యదర్శి కళ్లెం నగేష్, కాశెట్టి మహేష్, మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, దసర్తి పోచన్న,
గంజి జగన్, అక్కల రాజేష్, నక్క సాయి, జంగ రవి, జంగ రమేష్, జంగ మల్లేశం, వడ్ల రమేష్, కేతి మల్లయ్య, ఇస్త్రీ పోచన్న తదితరులు పాల్గొన్నారు.