సిరా న్యూస్,జగిత్యాల;
రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా కళాశాల లకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయక పోవడంతో పూర్తిగా ఈ పథకంతో నడిచే తెలంగాణ రాష్ట్రం లోని డిగ్రీ కళాశాలలు ఆర్థిక ఇబ్బందుల్లో వున్నాయని,జీతాల చెల్లింపు,భవనాల అద్దెలు, వడ్డీల చెల్లింపు,నిర్వహణ కూడా కష్టంగా వుందని తమకు రియంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని అధికారులు, మంత్రులు అందరినీ కలిసి ఎన్ని సార్లు అడిగినా కనీస స్పందన లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలుద్దాం అని ఎన్ని సార్లు ప్రయత్నించినా సమయం ఇవ్వకపోవడం తో అన్ని ప్రయత్నాలు చేసిన తరువాత చివరగా కళాశాలల నిరవధిక బందుకు డిగ్రీ కళాశాలల తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు ఇవ్వడంతో సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రం తోపాటు కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లోని
అన్ని డిగ్రీ కళాశాలలు బందులో పాల్గొన్నాయి..ప్రభుత్వం నుండి నిధులు విడుదల అయ్యే వరకు కళాశాలలు తెరవబోమని డిగ్రీ కళాశాల అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పోతని ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల చంద్రప్రకాష్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు తెలిపారు.