సిరా న్యూస్,మంథని;
మహిళల భద్రతపై, ఆన్లైన్ మోసాలపై, ఆంటీ డ్రగ్స్ పై పాఠశాల విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. బుధవారం రామగుండం సి.పి ఆదేశాల మేరకు మంథని పట్టణంలోని కృష్ణవేణి ఇంగ్లీష్మీడియం హై స్కూల్ విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించింది. షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని అన్నారు. మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. ఆకతాయిల నుండి ఎలా రక్షణగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది సురేష్ హెడ్ మాస్టర్ జఫ్ఫార్ హుస్సేన్, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో
విద్యార్థులు పాల్గొన్నారు.