-బీజేపీ మంథని మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్
సిరా న్యూస్,మంథని;
మండల ఏర్పాటుతోనే గుంజపడుగు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని బీజేపీ పార్టీ మంథని మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్ అన్నారు. గుంజపడుగు అభివృద్ధి కి ఈ ప్రాంత యువత ఉపాధికి అనేక అవకాశాలు ఉన్న పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి లేకపోవడంతో పాటు ఉపాధి లేక యువత చెడు అలవాట్లకు దగ్గరవుతున్నారన్నారు, గత ప్రభుత్వ సమయంలో గుంజపడుగు మండల కేంద్రం కోసం గుంజపడుగు తో పాటు చుట్ట ఉన్న గ్రామాల ప్రజలు మండల ఏర్పాటుకై ప్రభుత్వ దృషికి తీసుకెళ్లే విదంగా అనేక రాస్తారోకోలు, నిరసనలు దీక్షలు చేసిన ఫలితం లేకపోయిందన్నారు.గత ఎన్నికలలో నాయకులు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మండల ఆకాంక్షతో గెలిపించి అధికారం వచ్చి సంవత్సరం పూర్తి అయిన మండల ఏర్పాటుపై ఎలాంటి కార్యాచరణ చేయకపోవడం ఈ ప్రాంత నిర్లక్ష్యనికి నిదర్శనమన్నారు గత ప్రభుత్వ సమయంలో కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఎంతో కొంత అభివృద్ధి జరిగిందని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిన గ్రామ పంచాయితీలకు నిధుల జాడే లేదన్నారు.
గ్రామాలలో నిధులు లేక షానిటేషన్ లేదని , నాలిలా శుభ్రత లేదని అనేక మంది విష జ్వరాలతో బాధపడుతున్నారన్నారు,ఈ ప్రభుత్వ హయంలో కీలక మంత్రిగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఉన్నందున ఇప్పటికైనా మండల ఏర్పాటు చెయ్యడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత యువతకు మేలు జరిగే విధంగా గుంజపడుగు పరిధిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, మత్స్య పరిశ్రమలకై నిధులుకేటాయించాలని, గోదావరి తీరంలో ఉన్న పురాతన కసిపేట గుడిని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొని అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి వైభవాన్ని తీసుకురావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ని ప్రజల పక్షాన కోరుతున్ననాని బీజేపీ పార్టీ మంథని మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్ ఒక ప్రకటనలో కోరారు.