సిరా న్యూస్,చాగలమర్రి;
చాగలమరి పట్టణంలోని ముత్యాలపాడు రోడ్డు గురు మినరల్ వాటర్ ఎదురుగా వెలసిన శ్రీ శ్రీ శ్రీ హజరత్ దస్తగిరి స్వాముల ఉరుసు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది.శుక్రవారం రాత్రి ఒకటవ వార్డులోని చిత్రగంటి లాల్ బాషా కుటుంబం నుంచి మంగళ వాయిద్యాలతో పకీర్లచే గంధం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే 26వ తేదీ శనివారం అక్కడికి విచ్చేసిన భక్తాదులందరికీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శనివారం రాత్రి 10 గంటలకు బ్రహ్మాండమైన లైటింగ్ డెకరేషన్తో అనేక గొప్ప సంగీత వాయిద్యాలతో శ్రీ శ్రీ హజరత్ దస్తగిరి స్వామి వారి జండాల ఉత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రగంటి లాల్ బాషా గారి కుమారులు చాంద్ భాష, మా భాష, వార్డు మెంబర్ షబ్బీర్ ఎంపీటీసీ ఫయాజుద్దీన్ మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.