సిరా న్యూస్, కాల్వ శ్రీరాంపూర్
ఎస్ఆర్‌ఎస్పీ కెనాల్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం: ఎస్సై వెంకటేష్
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆరెపల్లి గ్రామ శివారులోని ఎస్ అర్ ఎస్ పి కెనాల్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఎస్ అర్ ఎస్ పి కెనాల్ లో కొట్టుకు రావడంతో రైతులు గమనించి సమాచారం అందించారని తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని బయటకు తీయించామని తెలిపారు. ఎవరైనా శవాన్ని గుర్తు పడితే శ్రీరాంపూర్ ఎస్సై నంబర్ 8712656512 కు సమాచారం అందించాలని తెలిపారు.