రాష్ట్రమంతటా మారుమ్రోగుతున్న బందరు అల్లర్లు
సిరా న్యూస్,మచిలీపట్నం;
దసరా పండుగ వచ్చింది అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అందరి దృష్టి కర్నూలు జిల్లా దేవరగట్టు పైనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ జాబితాలో బందరు కూడా చేరింది. కాకపొతే దేవరగట్టు గ్రామంలో కర్రలతో మాత్రమె కొట్టుకుని తలలు పగిలినా లెక్కచేయకుండా దేవతా మూర్తులను దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. బందరులో అయితే ఏకంగా రాళ్ళు విసురుకుని బీబత్సం సృష్టించారు. ఈరోజు మచిలీపట్నం శక్తీ పటాల ఊరేగింపు లో జరిగిన రాళ్ళ దాడిని పరిశీలిస్తే లా అండ్ ఆర్డర్ విఫలం అయ్యిందేమో అన్నట్లుగా ఉంది. పోలీసులు చూస్తుండగా చిన్నపిల్లలు కూడా దాడిలో పాల్గొనడం ఆచ్చర్యానికి గురిచేసింది. రెండు వర్గాల మద్య తలెత్తిన వివాదం రాళ్ళ దాడికి దారితీసింది. ఒకేమార్గంలో రెండు శక్తీ పటాల ఊరేగింపులు వెళుతున్నప్పుడు పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదా? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అర్ధం కావడం లేదు. అయినా వివాదం జరిగిన ప్రాంతంలో అన్ని రాళ్ళు ఎక్కడినుండి వచ్చాయి?