సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వెన్నెల నగర్ లోని ప్రజలకు 75 గజాలు స్థలమిచ్చి ఈరోజు వరకు వారికి సరైన ఇల్లు, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో పలు మార్లు మున్సిపల్ అధికారులకు సమస్య తెలిపినా పట్టించుకోకపోవడంతో సేవ్ కొత్తగూడెం- సేవ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ప్రజలు పోరు పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేపట్టారు. ఈసందర్భంగా జలాల్ మాట్లాడుతూ…. గత కొంతకాలం క్రితం 75 గజాలు స్థలం ఇచ్చిన ప్రభుత్వం వారికి కనీస ఇల్లు, మౌలిక సదుపాయాలు కల్పించకపోతే నిరుపేదలు ఎలా జీవించాలని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని, 832 కుటుంబాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.