సిరాన్యూస్, చిగురుమామిడి
సుందరగిరి పాఠశాలలో నమూనా ఎన్నికలు
* స్కూలు విద్యార్థులకు ఓటు వినియోగంపై అవగాహన
చిగురుమామిడి మండలంలోని సుందరగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామపంచాయతీ ఎన్నికలు, ఓటు హక్కు వినియోగం పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శనివారం “మోడల్ గ్రామ పంచాయతీ” నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థి ఇ హర్షిని ఆర్వోగా వ్యవహరించి ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ఓటు హక్కు, గ్రామ పంచాయతీ ఎన్నికలపై అవగాహన చేసుకున్నారు. తమ తల్లిదండ్రుల కూడా ఓటు హక్కు గురించి తెలుపుతామని స్కూలు విద్యార్థులు పేర్కొన్నారు. సర్పంచ్ గా బొలబత్తిని సాయి చరణ్, ఉప సర్పంచ్ గా వశిష్ట సాయి, జిల అఖిల్, ఎలగందుల మల్లికార్జున్, గొలుసుల లక్ష్మీ నరసింహ స్వామి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి పావని మాట్లాడుతూ. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటు హక్కు పై ఈ ఎన్నికల ద్వారా పిల్లలందరూ అవగాహన చేసుకున్నారని తెలిపారు. గ్రామంలోని తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి ఓటు హక్కు పై అవగాహన కల్పించి గ్రామపంచాయతీ ఎన్నికల్లో వారంతా పాల్గొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా వారికి తెలపాలని విద్యార్థిని విద్యార్థులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.