సిరా న్యూస్,కర్నూలు;
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని మేయర్ బి.వై. రామయ్య పిలుపునిచ్చారు.
*ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగము కర్నూలు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం నుండి రాజ్ విహార్ వరకు ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని మేయర్ బి.వై. రామయ్య జెండా ఊపి ప్రారంభించారు.
*ఈ సందర్భంగా మేయర్ బి.వై. రామయ్య మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు.ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషిచేయాలన్నారు.ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, అవగాహన లేని కారణంతో కొంతమంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్నారని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు భాగస్వాములు కావాలని అందరి భాగస్వామ్యంతోనే ఎయిడ్స్ వ్యాధి నివారణ సాధ్యమన్నారు. క్రమశిక్షణ కలిగి జీవనం సాగించినప్పుడే అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారని తెలియచేశారు.ఏ ఒక్క హెచ్ఐవి బాధితుల పట్ల వివక్ష చూపరాదని సూచించారు. అందరి సహకారంతో ఎయిడ్స్ జీరో పర్సెంట్ నమోదయ్యేలా కృషి చేద్దాం అన్నారు.హెచ్ఐవి సోకిందంటే ఆత్మహత్యలకు పాల్పడకుండా జాగ్రత్తలు పాటిస్తే వ్యాధిని నివారించవచ్చని తెలియచేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందించే మందులను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జీవిత కాలాన్ని గణనీయంగా పెంచుకోవచ్చని అన్నారు
*ఈ కార్యక్రమంలో DM&HO డా. రామ గిడ్డయ్య,అడిషనల్ DM&HO భాస్కర్, డాక్టర్ మల్లికార్జున,జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ హైదర్ అలీ,స్పోర్ట్స్ అథారిటీ సీఈఓ రమణ,నేస్తమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ పాజిటివ్ నెట్వర్క్ ప్రెసిడెంట్ సుధారాణి,ఎన్ సి సి విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు,స్వచ్ఛంద సంస్థలు,వైద్యశాఖ, లెప్రసీ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.