సిర్యానూస్, తిమ్మాపూర్
అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలి: తల్లా నరేష్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లా నరేష్ డిమాండ్ చేశారు. ధర్మసమాజ్ పార్టీ తరపున ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.ప్రతిపాదన నమూనా చిత్రాన్ని ఆమోదించాలని మంగళవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ తహసీల్దార్ అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ధర్మసమాజ్ పార్టీ నమూనా ప్రతిపాదన చిత్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఉస్మానియా యూనివర్సిటీ, సర్వాయి పాపన్న గౌడ్, పండగ సాయన్న, సమ్మక్క సారలక్క చిత్రాలు ఉన్నాయని తెలిపారు.అణగారిన వర్గాల పోరాటయోధుల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ మహనీయులను చిహ్నంలో పొందుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరెల్లి బాబు,కవ్వంపల్లి నరసయ్య జిల్లాల సురేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు