సిర్యానూస్, మానకొండూర్
నూతన చిహ్నంపై ధర్మ సమాజ్ పార్టీ సూచనలు: తల్లా నరేష్
* మానకొండూరు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత
రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా ధర్మసమాజ్ పార్టీ తరుపున నూతన చిహ్నంపై పలు సూచనలు చేస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరు తహసీల్దార్ సిహెచ్ రాజు కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లా నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం లో అంబేద్కర్ ఉస్మానియా యూనివర్సిటీ, సర్వాయి పాపన్న గౌడ్, పండుగ సాయన్న, సమ్మక్క సారలక్క ల ఫోటోలతో కూడిన నమూనా చిత్రాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు.ఈ పోరాట యోధుల స్ఫూర్తి తెలంగాణ భావితరాలకు ఎంతో ఆదర్శమని తెలిపారు. ధర్మసమాజ్ పార్టీ ప్రతిపాదన చిత్రాన్ని ఆమోదించేంత వరకు ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు మండల అధ్యక్షుడు ఆరెల్లి బాబు, తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు కవ్వంపల్లి నరసయ్య, చిగురుమామిడి మండల బాధ్యులు జిల్లాల సురేష్, నవీన్ , గాదెపాక ప్రశాంత్ రేకొండ తదితరులు పాల్గొన్నారు.