టపాసులు పేలి నలుగురికి గాయాలు

సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ పాతబస్తీలో బహదూర్ పురా పోలిస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ లో ఓ ఇంట్లో టపాసులు పేలిపోయాయి. గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన టపాసులు పేలడంతో నలుగురు గాయాలు పాలయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *