-గ్రీన్ ఫీల్డ్ ప్లాట్ల యజమానులు
సిరా న్యూస్,సికింద్రాబాద్;
ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట పాస్ బుక్ లు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీన్ ఫీల్డ్ ప్లాట్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి , జి వి వి ఎస్ మూర్తి, నాగేశ్వరరావు లు మాట్లాడుతూ మల్కాజ్ గిరి జిల్లా ఆల్వాల్ మండలం కానాజిగూడ గ్రామం లలోని 62. 16ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఫీల్డ్స్ వెంచర్ లో తాము ప్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు, సదరు భూమిపై వివాదాలు నెలకొనడంతో కొంతమంది కోర్టు కు వెళ్లి ఓ ఆర్ సి తెచ్చుకున్నారని చెప్పారు. జాయింట్ కలెక్టర్ రద్దు చేయగా దాని సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారని చెప్పారు. చివరకు సుప్రీంకోర్టు సైతం జాయింట్ కలెక్టర్ రద్దు ను సమర్థించిందని అన్నారు. అప్పటి నుండి స్టేటస్ కో లో ఉన్న భూమిని తమకు రెగ్యులరైజ్ కోసం నమోదు చేసుకోగా 2023 లో 385 సర్వే నెంబర్ లో ఐదు ఎకరాల భూమికి అధికారులు పాస్ బుక్ ఇచ్చారని తెలిపారు. ఇక అప్పటి నుండి తమకు వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.అక్రమంగా పాస్ బుక్ లు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.