సిరా న్యూస్,మేడ్చల్;
నాచారం పీఎస్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వెస్ట్ బెంగాల్ కు చెందిన విద్యార్థిని సంజిమా సంవత్సరం కాలంగా నాచారం లోని హాస్టల్ లో ఉంటోంది. బుధవారం సాయంత్రం హాస్టల్ రూం లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు సంజీమా మృతదేహాన్ని గాంధీకి తరలించారు. సంజిమ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది