సిరా న్యూస్,హైదరాబాద్;
కొండాపూర్ లోని హిందూ జై గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులపై దాడి జరిగింది. బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద మద్యం,గంజాయి సేవించి మత్తులో కత్తులు,కర్రలతో వీరంగం సృష్టించారు. దాడికి పాల్పడ్డ వారు బంజారాహిల్స్ కు చెందిన చందు ఫైల్వాన్,రణదీప్ గా గుర్తించారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.