సిరా న్యూస్,పిఠాపురం;
తెలుగుదేశంపార్టీ సభ్యత్వం పార్టీ కార్యకర్తలకు ఒక సంజీవని వంటిదని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు.తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణం మహారాజాకోట ఆవరణలోగల టీడీపీ కార్యాలయంలో పార్టీలో తన సభ్యత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా పిఠాపురం పట్టణ తెలుగుదేశంపార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ సభ్యత్వాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు..