సిరాన్యూస్, కళ్యాణదుర్గం
అనుమానస్పద స్థితిలో ఉపాధ్యాయుడు గోవింద రాజులు మృతి
అనుమానస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన కళ్యాణదుర్గం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణం గ్యాస్ గోడౌన్ సమీపంలోని బావిలో గోవింద రాజులు అనే ఉపాధ్యాయుడు శనివారం శవమై తేలాడు. కళ్యాణదుర్గానికి చెందిన గోవిందరాజులు సెట్టూరు ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. శనివారం ఆయన బావిలో పడి మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈమేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.