సిరాన్యూస్, ఇచ్చోడ
ఈనెల 31న ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకలు : ఏఐటీయూసీ కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య
ఏఐటీయూసీ 105 వ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల ఏఐటీయూసీ కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య పిలుపునిచ్చారు. శనివారం ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తున్న సమయంలో కార్మికుల ఉద్యమ హక్కుల సాధనకు ఏఐటీయూసీ ఏర్పడిందన్నారు. ఈ నెల 31న మండల కేంద్రంలో నిర్వహించే సంఘం ఆవిర్భావ దినోత్సవానికి కార్మికులు, ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.