సిరాన్యూస్, ఓదెల
ఈనెల 9,10 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం : తహసీల్దార్ బి యాకన్న
స్పెషల్ కాంపెయిన్ డే సందర్భంగా 01.01.2025 నాటికీ 18 సం. రాలు నిండిన యువతీ యువకులు కొత్త ఓటరు నమోదు ,సవరణ, మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉందని తహసీల్దార్ బి యాకన్న తెలిపారు. మీ మీ గ్రామాల్లో బూత్ లెవెల్ అధికారులు ఈనెల 9, 10 తేదీల్లో ఓటరు ప్రత్యేక నమోదు కార్యక్రమం ( స్పెషల్ కంపెయిన్) నిర్వహించనున్నారు. సంబందిత పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ధరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.