సిరాన్యూస్, సామర్లకోట
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సామర్లకోట మండలం మామిళ్ళ దొడ్డి గ్రామంలో రీ సర్వే గ్రామసభ నిర్వహించారు. ఈసందర్బంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సభలో 26 అర్జీలు వచ్చాయని అన్నారు .గ్రామ సభలో భూ యజమానులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు అన్ని పార్టీ నాయకులు పాల్గొని సర్వే అనంతర సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు.భూములపై రీ-సర్వే ప్రక్రియ, భూముల హక్కులను సరైన రీతిలో స్థాపించడం, పౌరులకు సరైన హక్కు పత్రాలను అందించటం, భూముల సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి రూపొందించబడిందన్నారు. గ్రామ సభల్లో అందించిన 26 ఫిర్యాదులు, భూములపై ఉన్న సమస్యలు గురించి ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ వై. శ్రీనివాస్, మండల సర్వేయర్ పి. సీతారామాచార్యులు, గ్రామ సర్వేయర్లు – సి హెచ్. నర్సింహమూర్తి, బి.జనార్దన్, బీఎస్ఎస్ రామకృష్ణ, సిహెచ్. స్వాతి గ్రామ రెవిన్యూ అధికారులు కె. చంద్రబాబు, ఆర్. కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.