సిరా న్యూస్, కోహెడ:
కాళోజీ బతుకంతా తెలంగాణ కోసమే : తహసీల్దార్ కె. సురేఖ
బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని తహసీల్దార్ కె. సురేఖ అన్నారు. పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు 110వ జయంతి వేడుకలు ప్రముఖ సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో సోమవారం కోహెడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తహశీల్దార్ కె. సురేఖ హాజరయ్యారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సామాజిక వేత్త రాజు హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. అనంతరం తహశీల్దార్ కె. సురేఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన ప్రజాకవి కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉందని అన్నారు. తెలంగాణ భాషా దినోత్సవం, సాహిత్యాలలో విశేషంగా కృషి చేశారని అన్నారు. వైద్య విశ్వవిద్యాలయంకీ కాళోజీ కీ నామకారణం, వరంగల్ జిల్లా లో కాళోజీ కళా కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కాళోజీ కవి ఆలోచనలు అన్ని వేళలా ఆదర్శం అని అన్నారు. గత పదిహేను ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు ని ప్రత్యేకంగా తహశీల్దార్ సురేఖ అభినందించారు. ఈకార్యక్రమంలో గుండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్, సుతారీ కనకయ్య, సీనియర్ అసిస్టెంట్ ఏ రాము, విద్యాలత, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.